Site icon Prime9

Charity on the Elderly: వృద్ధాశ్రమంకు చేయూత

Charity on the Elderly

Charity on the Elderly

Tirupati: దివంగతులైన పెద్దలను స్మరించుకొనే దినాల్లో మహాలయ అమావాస్య ఒకటి. పితృదేవతలను తలచుకుంటూ పేదలకు అన్నదానం చేస్తే వారు స్వర్గ లోప ప్రాప్తిని చేరుకొంటారనేది ఓ భావన. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్యవైశ్య సంఘం ఓ వృద్ధాశ్రమంకు ఫలసరుకుల అందచేసి పెద్దలను స్మరించుకొన్నారు.

స్థానిక సాయి సేవా వృద్దాశ్రమం లోని పేదలకు నెలరోజులకు సరిపడు బియ్యం, కూరగాయలు, ఫలసరుకులను అందించి వారంతా శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకున్నారు. స్థానికులు అనేక మంది పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ మానవ సేవే మాధవ సేవగా నిరూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ చేపట్టే కార్యక్రమాలు సైతం అందరిని మెప్పిస్తుండడంతో, విభన్న సేవల్లో వైశ్యులు తమ దాతృత్వాన్ని అందిస్తున్నారన్నారు. తల్లి తండ్రులను స్మరించుకొంటూ సేవకు ముందుకు వచ్చిన దుర్గి రమేష్ కుమార్ కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సేవకు కేరాఫ్ అడ్రస్సుగా సూళ్లూరుపేటవాసులు ఉండడం తమకు ఎంతో గర్వ కారణంగా ఉందని ఆనందం వ్యక్తంచేశారు.

Exit mobile version