Site icon Prime9

Andhra Pradesh : ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. “ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం” కింద రూ.10,460.87 కోట్లు రిలీజ్

central government release 10,460 crores to andhra pradesh

central government release 10,460 crores to andhra pradesh

Andhra Pradesh : ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న జగన్‌ సర్కారుకి పెద్ద బంపర్ ఆఫర్ ఏ ఇచ్చింది అని చెప్పాలి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు రాష్ట్రానికి అందించింది. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని వెంటనే ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని తెలిపారు. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది.

ప్రభుత్వం మారిన తర్వాత.. అధికారం లోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్‌ కూడా ఈ నిధుల విషయమై ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆమోదంతో నిధులు మంజూరవ్వడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర (Andhra Pradesh) విభజన తర్వాత కేంద్రం విడతల వారీగా నిధులు అందించేవారు. కానీ మొదటిసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకే దఫాలో ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేంద్రం రిలీజ్ చేయడం పట్ల ఎన్నికల వ్యూహం కూడా ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో.. 2014-15 సంవత్సర గ్యాప్‌ కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం..

2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.16,078 కోట్లుగా తేల్చారు. అందులో భాగంగా కేంద్రం

2014-15లో రూ.2,303 కోట్లు,

2015-16లో రూ.500 కోట్లు,

2016-17లో రూ.1,176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది.

ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని.. మిగిలింది  కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018 లోనూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపి కాగ్‌ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా పరిగణించాలని కోరింది. 2014-15 నాటికి చెల్లించని (పెండింగ్‌) బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. కానీ వాటిపై కేంద్రం స్పందించలేదు.

Exit mobile version