Site icon Prime9

Missile Man: ఘనంగా మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

Celebrating Missile Man Abdul Kalam's birth anniversary

Celebrating Missile Man Abdul Kalam's birth anniversary

Sullurpeta: భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక భూమిని పోషించిన మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాలలో శనివారం డాక్టర్ జీఎంకే హెల్త్ & ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో, తొలుత అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజేంద్ర అధ్యక్షతన వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన 20 మంది విద్యార్ధులకు స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సూళ్లూరుపేట, శ్రీహరికోట ప్రాంతాలతో కలాంకు విడదీయ లేని సంబంధం ఉందన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. కలాం కోరుకున్నట్లుగా కన్న కలలను సాకారం చేసుకొనేలా విద్యాభ్యాసం చేయాలని చిన్నారులకు సూచించారు. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్, పాఠశాల విద్యతోనే ప్రారంభం అవుతుందన్న విషయాన్ని తల్లి తండ్రులు పిల్లలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ కార్య క్రమంలో సొసైటీ అధ్యక్షులు ఉస్మాన్ బాష, డాక్టర్లు సాయిరాం, పరుచూరి సుబ్రమణ్యం, ఎంఎం పద్మజ, న్యాయవాది ప్రసాద్, వాసవి శబరీష్ , సాయిరాం, జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు వాకచర్ల మహేష్, భాను, సురేష్, వీరయ్య పలువురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: విశాఖ గడ్డపై జనసేనాని

Exit mobile version