Site icon Prime9

Banni Festival : బన్నీ ఉత్సవంలో ప్రమాదం.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు

Banni Festival at devarakadra leads to 3 death and 100 injured

Banni Festival at devarakadra leads to 3 death and 100 injured

Banni Festival : విజయదశమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డాయి. అయితే ఈ ఉత్సవంలో అనుకోని రీతిలో 3 మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

చెట్టు పైనుంచి పడి ఇద్దరు, ఊపిరాడక మరొకరు మృతి..

కాగా ఉత్సవాన్ని వీక్షిస్తున్న సమయంలో సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి భక్తులు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. దీంతో చెట్టు మీద నుంచి పలువురు భక్తులు కిందపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి ఇద్దరు యువకులు మృతిచెందగా.. ఊపిరాడక మరొకరు చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

కాగా కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కలెక్టరు, ఎస్పీ ప్రయత్నించారు. వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోయింది. విజయదశమి పర్వదినాన ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం దేవరగట్టుకు భక్తులు చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు బన్నీ ఉత్సవం కొనసాగింది. మరోవైపు ప్రభుత్వం ఈ ఉత్సవాల ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసింది. సుమారు 2000 వేల మంది పోలీసులు మోహరించారు. పోలీసులతో పాటు 100 మంది రెవెన్యూ 100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బంది వారితో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా విధులు నిర్వహించారు.

Exit mobile version