Site icon Prime9

CM Jagan: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల పై బ్యాన్‌.. సీఎం జగన్

cm jagan avanigadda tour

cm jagan avanigadda tour

Andhra Pradesh: ప్లాస్టిక్‌ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ఏపీ సీఎం జగన్‌ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు. అనంతరం ఎంవోయూ పై సంతకాలు జరిగాయి. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు అవుతోంది.

పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు, పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌, 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ఆయన ధరించి చూపించారు.

విశాఖ బీచ్‌రోడ్డులోని ఎగ్జిబిషన్‌ స్టాల్స్, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్ సందర్శించారు. పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో బీచ్ క్లీన్ డ్రైవ్ చేపట్టారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది.

Exit mobile version