Site icon Prime9

AP Weather Report : ఏపీకి చల్లటి కబురు.. మళ్ళీ రానున్న వర్షాలు

latest weather Update

latest weather Update

AP Weather Report : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఒక వైపు నిప్పుల కొలిమిలా మండుతూనే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణశాఖ ఏపీకి చల్లటి కబురు ప్రకటించింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉత్తర-దక్షిణ ద్రోణి.. విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని.. దాంతో ఏపీలో రాబోయే రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది అని ప్రకటించారు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం.. 

ఈరోజు :
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చునన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అటు ఈదురుగాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపారు.

రేపు :
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ (AP Weather Report).. 

ఈరోజు :
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు :
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ.. 

ఈరోజు:
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

 

Exit mobile version