AP IPS Officer PSR Anjaneyulu Arrested: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌లో తన నివాసంలో అరెస్ట్ చేశారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మకంగా ఉండేవారని తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నందున పోస్టింగ్ ఇవ్వలేదు.
గత కొంతకాలంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం సస్పెన్షన్‌లో పెట్టింది. తాజాగా, ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అనంతరం ముంబై నటి కేసు విషయంపై సీఐడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఓ వ్యాపార వేత్త అయిన విద్యాసాగర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.