Prime9

Pawan Kalyan Chennai Tour: చెన్నై పర్యటనలో పవన్ కల్యాణ్.. నేతల ఘన స్వాగతం!

Pawan Kalyan Chennai Tour: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంశంపై జరగే సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్- వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహిస్తున్నారు.

 

కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై వెళ్లారు. నిన్న రాత్రి చెన్నై విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం లభించింది. తమిళిసై సౌందర రాజన్, పలువురు బీజేపీ నేతలు, ఇతర నాయకులు సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ బసచేసిన హోటల్ వద్ద తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్, పలువురు బీజేపీ నేతలు కలిసి స్వాగతం పలికారు.

 

కాగా నేడు జరగనున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ సెమినార్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపితే వచ్చే లాభాలుపై మాట్లాడనున్నారు. అలాగే జమిలీ ఎన్నికలతో తలెత్తే సమస్యలను కూడా చర్చించనున్నారు.

 

Exit mobile version
Skip to toolbar