Site icon Prime9

AP Deputy CM Pawan kalyan: పార్మసీ విద్యార్థిని సూసైడ్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

PAWAN KALYAN

AP DEPUTY CM PAWAN KALYAN RESPONDS PHARMACY STUDENT ISSUE

AP Deputy CM Pawan kalyan Responds Pharmacy Student Naganjali Incidents: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో గత 12 రోజులుగా మృత్యువుతో పోరాడి ఫార్మసీ స్టూడెంట్ నాగ అంజలి ఇవాళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలికి తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని బాధపడుతూ మార్చి 23న అంజలి సూసైడ్ చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

తాజాగా, ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఫార్మసీ స్టూడెంట్ నాగ అంజలి సూసైడ్ దురదృష్టకరమని అన్నారు. యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాగ అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

 

అయితే, నాగ అంజలి సూసైడ్ చేసుకునేందుకు కారణమైన ఆస్పత్రి ఏజీఎం దీపక్‌పై చట్టప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar