Site icon Prime9

AP CM Chandrababu : త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

AP CM Chandrababu

AP CM Chandrababu

AP CM Chandrababu : త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని తెలిపారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

 

వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత..
కూటమి సర్కారు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాజధాని అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్‌కు శిక్షణ ఇస్తామని హామీనిచ్చారు. ఏటా రూ.1000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని జరుపుకోవడం ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఫూలే జయంతిని వాడవాడలా చేస్తున్నామని, ఆయన స్ఫూర్తి ఎంతో తెలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం ఆయన పోరాడారని ఉద్ఘాటించారు. ఏపీలో మహిళల చదువు ఆవశ్యకతను గుర్తించి మహిళా యూనివర్సిటీని దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని సీఎం గుర్తుచేశారు.

మూఢ నమ్మకాలపై ఫూలే రాజీలేని పోరాటం చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. టీడీపీ వచ్చేంతవరకు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. టీడీపీకి వెన్నెముక బలహీన వర్గాలు.. అలాంటి వారిని పూర్తిగా ఆదుకుంటామని సీఎం హామీనిచ్చారు.

 

 

Exit mobile version
Skip to toolbar