Prime9

CM Chandrababu : భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం : ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu inspects Handreeniva Sujala Sravanti works : భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఛాయాపురం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్‌పై దాడులు చేసిందన్నారు. ఇండియాపై దాడులు చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాక్ దాడుల్లో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు.

 

సరిహద్దుల్లో జవాన్లు నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారని, వారివల్లే మనం హాయిగా నిద్రపోతున్నామన్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదని హెచ్చిరించారు. భారత్ చేసే పోరాటానికి ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలని సూచించారు. భారత్ మాతాకి జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలుగాలని సీఎం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన..
శుక్రవారం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా ప్రతిరోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇటీవల వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా, వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. గడవులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version
Skip to toolbar