Site icon Prime9

AP CM Chandrababu : మే 2న అమరావతి పునఃప్రారంభ పనులు.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu

AP CM Chandrababu

AP CM Chandrababu : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ కూడా తయారు చేసింది.

 

ఏర్పాట్లు ముమ్మరం..
వెలగపూడి సచివాలయం వెనుక రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది జనం సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదేరోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‌రోడ్‌షోలో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. రూ.లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్‌‌కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

 

 

 

Exit mobile version
Skip to toolbar