Site icon Prime9

AP CM Chandrababu: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుందాం: ఏపీ సీఎం చంద్రబాబు!

Chandrababu

Chandrababu

AP CM Chandrababu Pays Tribute to Ambedkar: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్య్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మేరకు ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం కృషి: పవన్ కల్యాణ్
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కూటమి సర్కారు పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

 

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషి చేద్దాం: మంత్రి లోకేశ్
భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన వివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు నిరుపమానమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆ మహానీయుడు అనునిత్యం పరితపించారని గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి సర్కారు పనిచేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు.

 

Exit mobile version
Skip to toolbar