Site icon Prime9

Parry Sugars: ప్యారీ షుగర్స్ లో మరోసారి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

Another accident in Parry Sugars Two workers died

Another accident in Parry Sugars Two workers died

Parry Sugars: కాకినాడ జిల్లా వాకలపూడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆగష్టు 12వ తేదీన ఇదే పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఘటనలో మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. కార్మికుల కుటుంబ సభ్యులను లోపలికి అనుమంతించపోవడంతో గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Exit mobile version