Andhra Pradesh: అమరావతినే రాజధానిగా కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన పాదయాత్ర 29వ రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి పేరుతో మహా పాదయాత్రను గత నెలలో రైతులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వద్ద నేటి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది.
ఇలిందలపర్రు, ఇరగవరం మీదుగా సాగుతూ తణుకు మండలం వేల్పూరు వరకు సుమారు 16కి.మీ మేర నేడు పాదయాత్ర సాగనుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జన్మస్ధలం పెనుగొండ కావడంతో అమ్మవారిని రైతులు దర్శించుకొని పాదయాత్రను ప్రారంభించారు.
ఇప్పటికే పలు జిల్లాల మీదుగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని వర్గాలు, రైతులు, ప్రజానీకం, రాజకీయ పక్షాల మద్దతుతో విజయవంతంగా ముందడుగు వేస్తోంది. జోరున కురుస్తున్న వానకు జడవకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ వైకాపా మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వారితో పాటు నడిచి పాదయాత్ర ఉద్ధేశాన్ని ప్రజలకు తెలియచేస్తున్నారు.
ఒక రాష్ట్రం, ఒక రాజధానిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, రాష్ట్రాభివృద్ధిని సాధించడమే ప్రధాన ఉద్ధేశం కాగ, ఉద్యోగ అవకాశాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్న అమరావతి రాజధాని నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిన అవసరాన్ని ప్రజలకు పాదయాత్ర రైతులు తెలియచేస్తున్నారు. పాదయాత్ర ఆధ్యంతం శ్రీవారి రధం ఆకర్షనీయంగా ప్రజలను ఆకట్టుకొంటుంది. తొలి పాదయాత్రలో న్యాయస్ధానం టు దేవస్ధానం పేరుతో తిరుమలకు అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టివున్నారు.
ఇది కూడా చదవండి: రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికే ’రాజీడ్రామాలు‘