Site icon Prime9

AP ACB: ఏసీబీ వలలో ముగ్గురు రెవిన్యూ అధికారులు

Acb trapped three revenue officers

Acb trapped three revenue officers

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వేదంగా మారిపోయింది. వ్యవస్ధల పై సరైన పట్టు లేకపోవడంతో అధికారులు దోపిడీకి సై సై అంటున్నారు. విచ్చలవిడిగా లంచాలకు పాల్పొడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా రెవిన్యూ వ్యవస్ధలో లంచావతారమెత్తిన ముగ్గురు వ్యక్తులు, మూడు జిల్లాల్లో ఏసీబీ అధికారుల పన్నిన ట్రాప్ లో చిక్కుకున్నారు.

సమాచారం మేరకు, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వరగాన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పట్టాదారు పుస్తకం కోసం బాధితుడి నుంచి రూ. 8వేలు లంచం తీసుకున్న మౌలాలి అనే వీఆర్‌వో ఏసీబీ వలలో చిక్కారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ములుగపుడి పంచాయతీ కార్యాలయంలో పట్టా పాస్‌ పుస్తకం కోసం మంజూరులో 20వేలు తీసుకుంటూ మాటువేసిన ఏసీబీ అధికారులకు విఆర్వో రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిపోయారు. నెల్లూరు జిల్లా సీతారామాపురం తహసీల్దార్‌ సతీశ్‌ రూ. 10వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టుబడ్డ వారంతా రెవిన్యూ ఉద్యోగులే కావడంతో ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులపై సర్వత్రా చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి:  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకొన్న న్యాయవాదులు

Exit mobile version