Site icon Prime9

Krishna River : పండుగ పూట విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు మృతి

Krishna River

Krishna River

Three boys Missing in Krishna River : పండుగ పూట కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో ముగ్గురు బాలురు మృతిచెందారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ముగ్గురు బాలురు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగి ముగ్గురు బాలురు గల్లంతై మృతి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్‌ (15), ఎం.వీరబాబు (15), ఎం.వర్ధన్‌ (16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలికి చేరుకున్నారు. డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్‌, ఎస్సై శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

 

Exit mobile version
Skip to toolbar