Site icon Prime9

Suicide : ప్రేమ వ్యవహారం కారణంగా ఏపీలో ఇద్దరు మైనర్ల బలవన్మరణం.. వైజాగ్ లో ఒకరు, కానూరులో మరొకరు

9th class student suicide at visakhapatnam

9th class student suicide at visakhapatnam

Suicide : నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల  తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పట్టణంలోని గాజువాకలో గల కైలాస్ నగర్ కు చెందిన అఖిల్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.  ఓ ప్రైవేట్ స్కూల్లో 15 ఏళ్ల మైనర్ బాలుడు తొమ్మిదో తరగది చదువుకుంటున్నాడు. అదే స్కూల్లో చదివే ఓ బాలికతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు ఏమిటని తల్లిదండ్రులు మందలించడంతో బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. ప్రేమించే బాలికను ఉద్దేశించి ఓ సూసైడ్ లెటర్ రాసిపెట్టిన బాలుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులోనే నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తోందని.. నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోందని రాసి ఉండడాన్ని గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ స్కూల్లో జస్వంత్ సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినితో అతడు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఉపాధ్యాయులకు తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో బాలికకు మెసేజ్ లు పంపినట్లు తెలిసి స్కూల్ యాజమన్యం, టీచర్లు  జస్వంత్ ను మందలించారు. మరోసారి ఇలా చేస్తే బావుండదని హెచ్చరించారు. అయితే ఉపాధ్యాయులు చెప్పిన మంచిమాటలను జస్వంత్ అవమానంగా భావించాడు. తీవ్ర మనస్తాపానికి గురయిన అతడు విద్యార్థులంతా చూస్తుండగానే స్కూల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదో అంతస్తు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డ బాలున్ని స్కూల్ యాజమాన్యం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్దితి విషమించడంతో ఇవాళ జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Exit mobile version