Site icon Prime9

Weight Gain Tips: ఈ మూలికలను తీసుకుంటే ఇట్టే లావైపోతారు!

herbs prime9new

herbs prime9new

Weight gain: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధ పడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి ఒక ప్రయత్నం అని కాదు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు సన్నగా ఉన్నారని బాధపడుతూ, వారిని నలుగురిలో ఉన్నప్పుడు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోతారని హేళన చేస్తుంటారు. వీళ్లు బరువు పెరగడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గాలంటే కష్టం కానీ, బరువు పెరగాలంటే ఎంతసేపు అండి గట్టిగా ఒక పది రోజులు తిన్న ఇట్టే బరువు పెరుగుతారు. కానీ కొంతమంది ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఆయుర్వేదంలో కొన్ని మూలికలను తీసుకుంటే తొందరగా బరువు పెరుగి, ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు వెల్లడించారు.

అశ్వగంధ మూలిక

అశ్వగంధ మూలిక పురాతన కాలం నుంచి ఉంది. అశ్వగంధానికి పూర్తి అర్దం ఏంటంటే గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక యొక్క వాసన వేరుగా ఉంటుంది. ఆయుర్వేదంలో పలు రకాల వ్యాధులను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ మూలిక శరీర బలాన్ని పెంచుతుంది. ఆకలి లేకపోవడం, అలసటగా ఉన్న వాళ్ళకు, నిద్రలేమి సమస్యలు ఉన్న వాళ్ళకు ఈ మూలిక బాగా పని చేస్తుంది.

అతిమధురం మూలిక

ఈ మూలిక తియ్య‌గా ఉంటుంది. అతి మధురం మూలికలో ఔషద గుణాలు ఎక్కువ ఉంటాయి. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ ఉన్న వారికి ఈ మూలిక బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కువ సార్లు తీసుకున్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన శ‌రీరంలో వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోయి లివ‌ర్, కిడ్నీలను శుభ్రం చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Exit mobile version