Site icon Prime9

Curry Leaves: కరివేపాకు జ్యూస్ ఎప్పుడైనా తాగారా?.. ఇది తాగితే వచ్చే లాభాలేంటో తెలుసా?

karivepaku juice

karivepaku juice

Curry Leaves: అజీర్తి సమస్య చాలా మందిని వేధిస్తుంది. మరికొందరికి సమయానికి ఆకలి వేయదు. ఈ సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు. అజీర్తిని దూరం చేయవచ్చు.. అలాగే కొవ్వును కూడా ఈజీగా కరిగించుకోవచ్చు.

రక్తపోటును తగ్గిస్తుంది.. (Curry Leaves)

పూర్వకాలం నుంచే కరివేపాకును వంటల్లో వాడేవారు. కూరల్లో విరివిగా వాడటానికి ముఖ్య కారణం.. దీనిలో అనేక ఔషద గుణాలు ఉండటమే. ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడిలో పని.. అధికంగా బరువు పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వారికి ఓ పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం అనేక చిట్కాలు.. పద్దతులు పాటిస్తున్నారు. బరువు పెరగడం అనేది ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. దీని ఫలితంగా చాలా మందికి కొవ్వు పెరిగి అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కరిపేపాకు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల అజీర్తి సమస్య దూరం అవుతుంది. దీనితో పాటు సమయానికి ఆకలి వేస్తుంది. ఇక వేళకు ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. మరోవైపు కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర వహిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కూరల్లో ఉపయోగించే కరివేపాకు మంచి సువాసన కలిగిన పదార్థం. వంటల్లో కచ్చితంగా కరివేపాకును ఉపయోగిస్తారు. ఇది వంటల రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకుతో అనేక రోగాలు కూడా దూరం అవుతాయి. ఇందులో స్థూలకాయం ముఖ్యమైనది. ఇది స్థూలకాయన్నిచాలావరకు తగ్గిస్తుంది. పొట్ట,నడుము భాగాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే, కరివేపాకు జ్యూస్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు రోజువారిగా తింటే బాడీ డిటాక్స్ అవుతుంది.

ఉపయోగాలు ఇవే..

కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్ల సహాయంతో లిపిడ్, ఫ్యాట్ కరిగించవచ్చు. కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గించవచ్చు. దీంతో బ్లడ్, షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఉదయం పరగడుపున నాలుగు లేదా కరివేపాకులను పచ్చివి మంచిగా కడిగి నమిలినా మంచిదేనని నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం వలన బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్‌ ను బయటకు పంపేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని కంట్రోల్ చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల్ని నివారించుకోవచ్చు..

కరివేపాకు జ్యూస్ తయారీ ;

జ్యూస్ తయారు చేసేందుకు తొలుత కరివేపాకులను కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. కొద్ది సేపటి తరువాత ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. రుచికోసం అవసరమైతే.. నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవాలి. కరివేపాకు జ్యూస్ ని కేవలం పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Exit mobile version