Site icon Prime9

Coconut Water : కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఇన్ని లాభాలా.. ఇప్పుడే తెలుసుకోండి ..

uses of coconut water

uses of coconut water

Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్ లో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కొబ్బరి నీటికి ఉంది. ఈ నీరు తాగితే డీహైడ్రేషన్‌, ఎండ వేడి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు . ఈ సమ్మర్ లో చాలామందికి ఇదే ఫేవరెట్ డ్రింక్. శరీరం చెమట రూపంలో కోల్పోయిన నీటిని ఇది భర్తీ చేస్తుంది. ఆ విధంగా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. కొబ్బరి నీరు వంటిలో వేడిని కూడా తగ్గిస్తుంది.

అయితే ఈ కొబ్బరి నీరు తాగడానికి అంటూ ఒక సమయం అంటూ వుంది . ప్రతి రోజూ ఉదయం 10 గంటల సమయంలో ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. చర్మం తేమ నియంత్రణలో ఉండడమే కాకుండా బ్యాక్టీరియా సంబంధ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి చర్మానికి లభిస్తుంది.కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి పానియం. సోడా లేదా షుగర్ డ్రింక్స్ తీసుకోవడానికి బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం శ్రేష్టం.కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే పొద్దునే తాగడం మంచిది. అయితే మితంగానే తీసుకోవాలి. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజాన్ని అందిస్తుంది. కొబ్బరి నీరు ఒక అద్భుతమైన సహజ ఎలక్ట్రోలైట్ మూలం.

అయితే, కొబ్బరి నీరు అందరికీ మంచిదేనా? ఎలాంటి వ్యక్తులు అయినా తాగొచ్చా? అంటే కాదని అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది వ్యక్తులకు కొబ్బరి నీరు మంచిది కాదన్నారు. రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్న వారు కొబ్బరి నీరుకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, గుండె స్పందన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొబ్బరి నీరు తాగరాదు” అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.కొందరు వ్యక్తులు నిద్రకు ముందు ఓదార్పు, హైడ్రేటింగ్ కోసం కొబ్బరి నీరు తాగుతారు. ఇది కరెక్ట్ కాదు. మీ ప్రాధాన్యతలను, కొబ్బరి నీరు మీ నిద్రను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అన్న విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వ్యక్తులను బట్టి వారి ప్రాధాన్యతలు, దిన చర్యలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ శరీర అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా కొబ్బరి నీళ్లను తీసుకోవడం మంచిది” అని వైద్య నిపుణులు సూచించారు

Exit mobile version