Kiwi Fruit: మనం రోజువారిగా తీసుకునే ఆహారం ముఖ్యం కాదు. తాజాగా వండుకునే కూరగాయలు, పండ్లు ముఖ్యం. వీటి నుంచి అంతా ఇంతా కాదు బోలేడు పోషకాలు అందుతాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. మనం రోజు అనేక పండ్లను తీసుకుంటాం. అందులో ముఖ్యమైనది కివీ పండు. ఈ పండులో ఎన్నో ప్రత్యేకతలు.. పోషకాలు ఉంటాయి. ఈ పండు తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజు వారీ ఆహారంలో భాగంగా.. పండ్లు, కూరగాయలు తింటుంటాం. పుచ్చకాయ నుండి అరటి పండు వరకు మనం తినేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందులో ముఖ్యమైనది కివీ పండు. ఈ పండుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఈ పండుకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువగా చైనీయులు ఈ పండును బాగా తింటారు. ఇది ముఖ్యంగా నిద్రలేమి సమస్యను పోగొడుతుంది. నిద్రపోవడానికి ఉపయోగపడుకుంది. ఈ పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నందున రాత్రులు నిద్రపోవడానికి సహాయపడుతుంది
కమలాల్లో ఉన్న సి విటమిన్ కు రెట్టింపు.. ఆపిల్ లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు ఈ పండు సొంతం. ఈ పండు పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఈ ఫలం అందించే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఇ లు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్ , పొటాషియం ఈ పండు ప్రత్యేకత. ఆరోగ్యం నుండి రోగనిరోధక శక్తి వరకు అనేక ప్రయోజనాలు దీని సొంతం.
కివిలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. ఇది మృదువుగా ఉండే చర్మానికి దోహదపడుతుంది. కివిలో వృద్ధాప్యం, ముడతలను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కివీని పచ్చిగా తినవచ్చు లేదంటే చర్మానికి పేస్ట్ గా చేసి అప్లై చేసుకోవచ్చు. సూర్యరశ్మి, పొగ వల్ల, వాయు కాలుష్యం చర్మం పాడవకుండా కివీ దోహదపడుతుంది. కివీ పండులో పొటాషియం కంటెంట్ వల్ల రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. మధుమేహం వంటి వ్యాధులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో రక్తాన్ని గడ్డకట్టకుండా చూస్తుంది. జీర్ణక్రియకు కివీ చాలా ఉపయోగకరం. ప్రతి 100 గ్రాముల కివీ 3 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఈ పండు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.
కివీ పండు నిద్రలేమిని పోగొట్టి.. నిద్రపోవడానికి సహాయం చేస్తుంది. కివి పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాల వల్ల రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుంది.
కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన కారకాలను నివారిస్తుంది. కేన్సర్ రావటానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.
కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉండేలా చేస్తాయి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
శరీరంలో ఉండే అనవసరపు టాక్సిన్లని అరికట్టేందుకు కివి పండు దోహదపడుతుంది.
బరువు తగ్గలనుకునే వారికి ఈ పండు ఒక వరం. దీనిని తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను రక్షిస్తుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాలల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీంతో రక్తపోటును నియంత్రించవచ్చు. కివీ కేన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను నివారిస్తుంది.