Office Work: కొందరు ఆఫీసు పనిని ఎంతో తేలిగ్గా చేసేస్తారు. మరికొందరు దాన్నో బరువుగా భావిస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. మీరు కూడా ఆఫీసు పనిని చకచకా పూర్తిచేయాలనుకుంటున్నారా? అయితే మీ షెడ్యూల్ లో ఈ మార్పులు చేసుకుని ప్రయత్నించండి.
క్రమ పద్దతిలో
ఎక్కువ గంటలు పనిచేయాలనే లెక్కల కంటే… చేసే పనిని ఎంత స్మార్ట్‌గా, నాణ్యంగా పూర్తి చేస్తామన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఏది ముఖ్యమో డిసైడ్ చేసుకుని.. ఆ క్రమంలో పని పూర్తి చేసుకోవాలి.
నిరంతరాయంగా పనిచేసినా వర్క్ లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. రెండు గంటలకు ఒకసారైనా చిన్నపాటి విరామాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి రాకుండా ఉంటుంది.
బిజీ జీవితంలో ఒక్కోసారి సరిగా తినక.. హడావుడిగా ఆఫీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది.
ఇలాంటప్పుడు ఖాళీ కడుపుతో ఉండిపోయినా, జంక్‌ఫుడ్ తినడం మొదలుపెట్టినా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.
అందుకే నట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం లాంటివి దగ్గర ఉంచుకోండి. అవి వెంటనే తక్షణశక్తిని ఇవ్వడంతో పాటూ ఆకలి ని తగ్గిస్తాయి.
మధ్య మధ్యలో నడక (Office Work)
మీరు కూర్చునే డెస్క్ మీద గానీ, డెస్క్‌టాప్ మీద అయినా అవసరం లేని ఫోల్డర్స్ , పేపర్స్, ఫైల్స్ లాంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేయండి.
ఇంటిని అందంగా పెట్టుకున్నట్టే.. పనిచేసే డెస్క్ ను కూడా అందంగా ఉంచుకోవాలి.
అపుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓ చిన్న మొక్కను కూడా టేబుల్‌పై పెట్టుకుంటే ఇంకా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
ఆఫీసుకు వెళ్లింది మొదలు.. గంటలతరబడి కూర్చుని పనిచేస్తుంటాం. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు, శక్తి కూడా తగ్గుతుంది.
దాంతో కాసేపు కూర్చోగానే త్వరగా అలసిపోతుంటాం. కాబట్టి కొద్ది సమయం చిక్కినా నాలుగు అడుగులు వేయడానికి ప్రయత్నించండి.
వాడే కంప్యూటర్ ఎత్తు, మనం కూర్చునే విధానం అన్నీ సరి చూసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చూపు తగ్గడం, నడుం నొప్పి, కాళ్ల వాపులు లాంటివి ఎదురుకావొచ్చు.