Neck Pain: లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పులు వచ్చినా.. వర్క్ లో ఒత్తిడి పెరిగినా మెడనొప్పి విపరీతంగా బాధిస్తుంది. ప్రస్తుతం చాలా వరకు వర్క్ ఫ్రం హోమ్ లు నిర్వహిస్తున్నారు.
అలాంటపుడు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు ఉండాల్సి వస్తుంది. దాని వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు చాలా సమస్యలు ఎదర్కోవాల్సి వస్తోంది.
అయితే మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. గంటల తరబడి కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి ఎక్కువగా ఉంటుంది.
అందుకు మనం కూర్చునే విధానం కూడా కారణం కావచ్చు. కానీ మెడనొప్పిని చిన్న సమస్యగా తీసుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు అవసరం
కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేటపుడు సరిగ్గా కూర్చోవాలి. లేకపోతే కండరాలు ఒత్తిడికి గురై మెడనొప్పికి కారణమవుతుంది.
సెల్ ఫోన్లు , టాబ్లెట్లు, చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగిస్తున్నపుడు మెడను వంచకూడదు. కాబట్టి ఈ వస్తువులు వాడేటపుడు తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో ఉంచుకోవాలి.
అలాగే వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీకి సౌలకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
పడుకునేటప్పుడు కూడా తలకింద వాడే పిల్లోస్ ను సరైనవి ఎంచుకోవాలి. మరీ పెద్ద సైజు వాటిని ఉపయోగించక పోవడమే మంచిది.
ముఖ్యంగా కాళ్ల కింద దిండును ఉపయోగిస్తే మంచిది. దీని వల్ల వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి.
ఎక్కువగా డ్రైవ్ చేసినా మెడనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రైవ్ చేసేటపుడు మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ముఖ్యంగా మెడను, భుజాలను బాగా కదిలించాలి.
సాధారంగా ఎక్కువమంది బ్యాక్ ప్యాక్ లను ఉపయోగిస్తారు. అయితే వాటిని వాడేటప్పుడు భుజాలు , చేతులపై ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి.
ఎందుకంటే బరువు ఎక్కువ అవడంతో భుజాలపై ఒత్తిడి కలిగి మెడనొప్పి వస్తుంది.
ఎక్కువగా ఒకేచోట కూర్చోవద్దు. ఎక్కువగా నడుస్తూ ఉండాలి. నిద్రపోకపోవడం వల్ల కూడా మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఏదైనా వ్యాయామాలు లేదా జిమ్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మెడ పట్టేసి కొద్దిరోజుల పాటు నొప్పి కలిగే అవకాశాలు కూడా ఉంటాయి.
మెడనొప్పి నుంచి రిలీఫ్ కోసం స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, ఫిజియో లు చెప్పే సూచనలను పాటించడం వల్ల కూడా మెడనొప్పి తొందరగా తగ్గుతుంది.
మెడనొప్పి బాగా వేధిస్తుంటే చల్లగా లేదా వెచ్చిని కాపడం పెట్టుకోవచ్చు. ఇది కండరాలను సడలిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.
మరో వైపు మసాజ్ వల్ల ఉపశమనం పొందవచ్చు. మసాజ్ వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/