Site icon Prime9

Morning Weight Loss Tips: డైలీ మార్నింగ్ ఇలా చాస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా..?

Weight Loss Tips

Weight Loss Tips

Morning Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊబకాయంతో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే అనేక మంది బరువు తగ్గడానికి  డైటింగ్ , వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ సరైన అలవాట్లతో పాటు ఆరోగ్యకరమైన లైప్ స్టైల్ మాత్రమే మీ జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ప్రతి రోజు ఉదయం కొన్ని టిప్స్ పాటించడమే.

 

గోరువెచ్చని నీరు త్రాగడం అలవాటు చేసుకోండి:
ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. వీలైతే గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇది మీ జీర్ణక్రియ పెంచడంలో సహాయపడుతుంది.

 

వ్యాయామం లేదా యోగా:
ఉదయాన్నే వాకింగ్, సూర్య నమస్కారం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవచ్చు. మీకు థైరాయిడ్ లేదా ఏదైనా ఇతర జీవక్రియ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంటే, క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కూడా మీరు ఈజీగా బరువు తగ్గుతారు. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

 

హోం రెమెడీస్:
ఉదయం నిద్ర లేచిన తర్వాత గ్రీన్ టీ, సోంపు వాటర్, జీలకర్ర నీరు లేదా మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ డ్రింక్స్ జీవక్రియను వేగవంతం చేస్తాయి. అంతే కాకుండా శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

 

ఆరోగ్యకరమైన, అధిక ప్రోటీన్ కలిగిన ఫుడ్:
మీరు ఆరోగ్యకరమైన టిఫిన్ ఉదయం పూట తీసుకుంటే.. మీకు రోజంతా ఆకలి తక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి తినాలన్న కోరికలు నియంత్రించబడతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే అల్పాహారం కండరాలను బలపరుస్తుంది . అంతే కాకుండా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే బరువు తగ్గాలని అనుకునే వారు బయటి, జంక్ ఫుడ్ తినకుండా ఉండటం మంచిది.

 

అడపాదడపా ఉపవాసం పాటించండి:
మీరు అడపాదడపా ఉపవాసం చేస్తుంటే, ఉదయం హెర్బల్ టీ లేదా నిమ్మకాయ నీరు మాత్రమే తాగి, మధ్యాహ్నం 12 గంటలకు మీ మొదటి భోజనం చేయండి. శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు తీనే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

సూర్యకాంతిలో సమయం గడపండి:
ఉదయం 10-15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది . ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 

 

Exit mobile version
Skip to toolbar