Site icon Prime9

Monsoon Herbs: ఈ మూలికలతో వర్షాకాలంలో వచ్చే సమస్యలు మటుమాయం

Monsoon herbs

Monsoon herbs

Monsoon Herbs: భారతీయలు అనాది కాలం నుంచి ఆయుర్వేదాన్ని విశ్వసిస్తారు. ఆయుర్వేదం అనేక రకాల రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. ఇంగ్లీషు మందులు వైద్యం నయం చేయలేని ఎన్నో సమస్యల్ని దూరం చేయడంలో ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. కాగా సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మీ సొంతమవుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.

తులసి..

తులసిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇనన్ఫెక్షన్స్ తులసి ఆకులు తింటే నయం చేసుకోవచ్చు. తులసి ఆకులని నేరుగా తీసుకోవడం, టీ చేసుకుని తీసుకోడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా దూరమవుతుంది.

వేప..
అనేక సమస్యలకి వేప చక్కని పరిష్కారం. దీనిని దాదాపు 75 శాతం ఆయుర్వేదంలో వాడతారు. వేపలో యాంటీ మైక్రోబయల్, శిలీంద్ర సంహారిణి లక్షణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్త శుద్ధి జరగడమే కాకుండా బాడీ నుండి ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. మొటిమలు, తామర, చర్మ సమస్యలకి ఇది మంచి ట్రీట్‌మెంట్. వేప నోటి ఆరోగ్యం, జుట్టు సంరక్షణకి మంచిది.

మంజిష్ట..
మంజిష్ట అనే మూలికను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాలేయం, మూత్రపిండాలు, చర్మాన్ని శుభ్రపరచడంలో ఈ మూలిక ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది మొటిమలు, అలర్జీలను నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

త్రిఫల..
త్రిఫల అనేది మూడు మూలికల కలయిక. ఇది యాంటీ ఆక్సిడెంట్, డీటాక్సీఫైయర్‌గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచడంతో పాటు, జీర్ణక్రియని మెరుగ్గా చేయడంలో త్రిఫల పొడి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల హెల్దీగా మారతారు.

అశ్వగంధ..
అశ్వగంధను ఇండియనన్ జిన్సెంగ్, వింటర్ చెర్రీ అని కూడా అంటారు. ఇది ఆరోగాన్ని మెరుగ్గా పరచడమే కాకుండా లైంగిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. నాడీ వ్యవస్థకి చాలా మంచిది. ఇమ్యూనిటీ పెంచి.. ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. నిద్ర పట్టేలా చేసి జ్ఞాపకశక్తిని మెరుగ్గా చేస్తుంది. బరువు తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బ్రాహ్మి..
బ్రాహ్మి ఆకులని సరస్వతి ఆకులు అని కూడా అంటారు. వీటిని వాడడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మేధస్సుని పెంచుతుంది. పిల్లలకి కూడా ఇవ్వడం కూడా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ తగ్గి మనస్సుని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇది బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల చర్మ, జుట్టు ఆరోగ్యానిక తీసుకోవచ్చు.

Exit mobile version