Site icon Prime9

Pragnya Ayyagari: లివా మిస్‌ దివా సూపర్‌నేషనల్‌- 2022 కిరీటాన్ని గెలుపొందిన తెలుగమ్మాయి

Pragnya Ayyagari prime9 news

Pragnya Ayyagari prime9 news

Pragnya Ayyagari: లివా మిస్‌ దివా సూపర్‌నేషనల్‌- 2022 కిరీటాన్నితెలుగు అమ్మాయి ప్రజ్ఞ అయ్యగారి కైవసం చేసుకుంది. ప్రేమ కిరీటంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రజ్ఞకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

‘ప్రౌడ్‌ డాడ్‌’, ‘ప్రౌడ్‌ మామ్‌’ వంటి ప్లకార్డులు పట్టుకుని ప్రజ్ఞ తల్లిదండ్రులైన మాధవి, శ్రీనివాస్‌ లు ఆమెకు ఘన స్వాగతం పలికి, కూతురిని ముద్దాడారు. అందాల కిరీటాన్ని అమ్మానాన్నలకు అలంకరించి తన విజయాన్ని వారికి అంకితమిచ్చింది ప్రజ్ఞ. చాలా రోజుల తర్వాత ఆత్మీయులను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, నా వాళ్లు గర్వపడే విజయం సాధించానని అనుకుంటున్నానని ప్రజ్ఞ ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి కుటుంబం దొరకడం తన అదృష్టమని ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ భావోద్వేగానికి గురైంది ఈ అందాల భామ.

అనేక రంగాల్లో ప్రజ్ఞా ప్రావీణం..

అనేక రంగాల్లో ఈ అందాల భామకు ప్రావీణ్యం ఉంది. తను ఒక క్వాలిఫైడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. భరతనాట్య కళాకారిణి కూడా. చదరంగం అంటే ఆమెకు అత్యంత ఇష్టం. కొరియన్‌ మూవీస్‌ తెగ చూస్తుందట. ఎకోఫ్రెండ్లీ వస్ర్తాలతో ఓ బ్రాండ్‌ సృష్టించాలన్నది తన కల అని ఈ అందాల భామ మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. బోయిన్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌లో తన స్కూలింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశానని ఆమె వివరించింది .

 

Exit mobile version