Site icon Prime9

Crack Heels: పాదాల పగుళ్లకు చెక్ పెట్టండిలా..!

home remedies to repair crack heels

home remedies to repair crack heels

Crack Heels: శీతాకాలం వచ్చింది అంటే చాలు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మంపై పగుళ్లు ఏర్పడటం, శరీరం పొడిబారిపోవడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే వీటిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారతాయి. విపరీతమైన చలి, శరీరం పొడిబారడం, గట్టి నేలపై చెప్పులు లేకుండా నడవడం, శరీరంలో రక్తం తక్కువగా ఉండటం, దుమ్ము-ధూళి కాలుష్యం మొదలైన కారణాల వల్ల కాళ్ల మడమలలో పగుళ్లు ఏర్పడతాయి. మరి చీలమండల పగుళ్లు ఏర్పడినపుడు పట్టించుకోకుండా ఉంటే అది రక్తస్రావంతో పాటు, భగభగ మంట, నొప్పికి దారితీస్తుంది. మరి పాదాల పగుళ్లను తగ్గించి, వాటి సంరక్షణకు ఉపయోగపడే చక్కటి వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందామా..

ఇంగువ

ఒక గిన్నెలో కొంచెం ఇంగువ తీసుకుని అందులో వేపనూనెను కలిపి లేపనంగా తయారు చేసుకుని రాత్రి పడుకునే ముందు కాళ్ల పగుళ్లకు రాసుకోవాలి. దీని ద్వారా పగుళ్లు దాదాపు నయం అవుతాయి.

తేనెతో మృదుత్వం
ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో అరకప్పు తేనె కలిపి ఆ నీటిలో సుమారు 20 నిమిషాల పాటు పాదాలను ఉంచడం ద్వారా చాలా ఉపశమనం కలుగుతుంది. కాళ్లు కడుక్కుని కోల్డ్ క్రీమ్‌తో మసాజ్ చేయండి. ఇలా చెయ్యడం వల్ల పగిలిన మడిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అరటిపండు గుజ్జు
బాగా పండిన అరటిపండు గుజ్జును మెత్తగా చేసి పగుళ్లపై రాయండి. ఒక 20 నిమిషాల తర్వాత పాదాలను కేవలం సాధారణ నీళ్లతో మాత్రమే కడిగేసుకోవాలి సబ్బును ఉపయోగించకూడదు. ఇలా చెయ్యడం వల్ల కూడా పగుళ్లు నయం అవుతాయి.
కొబ్బరి నూనె వాక్స్
కొబ్బరి నూనె పగిలిన మడమలను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు పగిలిన మడమల నొప్పితో బాధపడుతుంటే, కొద్దిగా మైనం లేదా వేజిలెన్ తీసుకొని అందులో కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని పగిలిన చోట పూయడం వల్ల రిలీఫ్ వస్తుంది.
ఆముదము
పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి, ఆ తర్వాత ఆముదం రాస్తే, మడమల పగుళ్లు నయమవుతాయి.

ఇదీ చదవండి: పుట్టగొడుగులు శాఖాహారమా, మాంసాహారమా..? వెజిటేరియన్స్ ఎందుకు తినరు..?

Exit mobile version