Tips For Glowing Skin: మేకప్‌ లేకుండా మెరిసే చర్మం కావాలా? – ఈ టిప్స్ పాటిస్తే చాలు, అవేంటంటే!

  • Written By:
  • Publish Date - December 13, 2024 / 05:30 AM IST

Simple Skin Care Routine: అమ్మాయిలు, అబ్బాయిలైన అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. నలుపు, తెలుగు అని లేకుండా మీ చర్మం గ్లోగా ఉంటే చాలా ఆకర్షణియంగా ఉంటారు. అందుకే చాలా మంది స్కిన్‌ గ్లో కోసం ఏవేవో చేస్తుంటారు. మార్కెట్లో లభించే క్రీం, మేకప్‌తో గ్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అవన్ని టెంపరీ మాత్రమే. వాటి వల్ల మీ స్కీన్‌కి డ్యామెజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాజంగా మెరిసే చర్మం కావాలనుకునే వారు ఇలా చేస్తే చాలట. మీ డైలీ రోటీన్‌లో మార్పులు, చేర్పులతో పాటు వ్యాయమంతో స్కిన్‌ని గ్లో చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

డైట్​
ఆరోగ్యమైన జీవనశైలిలో డైట్‌ ముఖ్యం. రోజు మన ఆహారంలో ఏం తింటున్నాం, ఏవేవి ఉంటున్నాయనేది ముఖ్యం. ప్రతిరోజు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తుంటారు. స్కిన్‌ గ్లోయింగ్‌కి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయంటున్నారు. డైలీ మీ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు పప్పులు, హెల్తీ ఫ్యాట్స్‌ని డైట్‌లో యాడ్‌ చేసుకుంటే మంచిది. అలాగే ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకుంటే టాక్సిన్లను బయటకు పండంతో హెల్ప్‌ చేస్తాయి. తద్వారా మీ స్కీన్‌ హెల్తీగా అవ్వడమే కాదు గ్లోని కూడా ఇస్తుంది.

వ్యాయామం
వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచడం కాదు అందాన్ని కూడా పెంచుతుంది. రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే మీ స్కిన్​ గ్లో అవుతుంది. కావాలంటే కొన్ని రోజులు ఎక్సర్​సైజ్ చేసి చూడండి మీ చర్మంలో వచ్చే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్​గా వర్క్​అవుట్​లు, వాకింగ్ వంటివి చేస్తూ ఉండండి.

నిద్ర
మనిషి నిద్ర అనేది చాలా ముఖ్యం. అదీ కూడా సరిపడినంత ఉండాలి. మనిషికి 8 గంటల నిద్ర తప్పనిసరి. రోజూ ఎనిమిది గంటలు నిద్ర తగ్గకుండ చూసుకుంటే మీ ఆరోగ్యమే కాదు చర్మం కూడా మెరుసిపోతుందని నిపుణులు అంటున్నారు. రోజూ 8 గంటలు నిద్రపోతే చర్మం మెరవడమే కాదు వృద్ధాప్య ఛాయలు కూడా దూరమైపోతాయి. కాబట్టి నిద్ర విషయంలో అసలు కాంప్రిమైజ్ కాకండి.

ఒత్తిడి
ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని వల్ల స్కిన్​ హెల్త్​ కూడా డ్యామేజ్ అవుతుందట. కాబట్టి గ్లోయింగ్‌ స్కిన్‌ కావాలంటే ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.

హైడ్రేషన్
స్కిన్​ని హెల్తీగా ఉంచడంలో, గ్లోని అందించడంలో హైడ్రేషన్ అనేది కీ రోల్‌ పోషిస్తుందనడంలో సందేహం లేదు. రోజూ శరీరానికి సరిపడ నిళ్లు తాగితే అనారోగ్యమే అనేది ఉండదని డాక్టర్లు చెబుతుంటారు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి. ఇది స్కిన్​ హెల్త్​ని మెరుగుపరించి మీకు సహజమైన మెరుపుని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది.

సన్​ స్క్రీన్
ఏ కాలంలోనైనా సన్‌స్క్రీన్‌ వాడటం చాలా ముఖ్యం. చాలా మంది బయటకు వెళ్లినప్పుడు దీన్ని ప్రీఫర్‌ చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న కూడా సన్​స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకూడదట. ఇది సూర్య కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. దీనివల్ల చర్మం డ్యామేజ్‌ అవ్వదు. రోజూ ఈ సన్‌స్క్రిన్‌ వాడితే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు మంచి గ్లోని కూడా ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్​కి బారియర్​గా ఉంటుంది.

ఎక్స్​ఫోలియేట్
స్కిన్​ని వారానికోసారైనా ఎక్స్​ఫోలియేట్ చేయాలి. దీనివల్ల స్కిన్​పై ఉండే డార్క్, టాన్​ అంతా పోతుంది. అంతేకాకుండా స్కిన్​ని కూడా బ్రైట్​గా చేస్తుంది. డెడ్​ సెల్స్​ని రిమూవ్ చేసి.. గ్లోని అందిస్తుంది.