Site icon Prime9

Garlic Water: వెల్లుల్లి నీరుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

garlic water

garlic water

Garlic Water: వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని వంటల్లో వేసుకుని తింటారు. అలాకాకుండా మరికొందు నేరుగా తింటూ ఉంటారు. ఇంకొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. అసలు వెల్లుల్లి నీటిని ఎలా చేసుకోవాలి.. ఆ నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఎలా తయారు చెయ్యాలంటే(Garlic Water)

ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి వాటిని బాగా నలగొట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకుని కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు శరీరాన్ని అనేక రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ లను నిరోధించవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వెల్లుల్లి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.

అంతేకాకుండా షుగర్ ను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదే విధంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు, గుండె జబ్బులతో బాధపడే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఈ నీరు చక్కగా పని చేస్తుంది. అదే విధంగా కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

Exit mobile version
Skip to toolbar