Prime9

New Covid-19 Precautions: విజృంభిస్తున్న కరోనా.. ఇలా చేస్తే కరోనా దరిచేరదు!

New Covid-19 Precautions: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గత కొంతకాలంగా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. జనవరి నుంచి నేటి వరకు 8,573 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కేంద్రం సైతం అప్రమత్తమైంది. మరోవైపు కరోనా రాకుండా ఉండాలంటే వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే కరోనా దరిచేరదని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

ప్రతిరోజూ ఎవరూ ఖాళీ కడుపుతో ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉండొద్దని సలహాలు ఇస్తున్నారు. ప్రతి ఉదయం ఒక గంట పాటు సూర్యకాంతి తీసుకోవాలి. ఏసీ ఉపయోగించవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి వస్తే దానిని పరిమితం చేయవద్దు. గోరువెచ్చని నీరు తాగాలని, గొంతు తేమగా ఉంచేలా చూసుకోవాలన్నారు.

 

ఇక, ముక్కులో ఆవాల నూనె రాస్తూ ఉండాలని, ఇంట్లో కర్పూరం, ‘గుగ్గల్’ కాల్చాలని చెప్పారు. సురక్షితంగా ఉండేందుకు అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దన్నారు. ఇంట్లో ఉండాలని, వంట చేసేటప్పుడు ప్రతి కూరగాయకు అర టీస్పూన్ ఎండిన అల్లం పొడిని జోడించాలన్నారు.

 

రాత్రి సమయాల్లో పెరుగు, మజ్జిగ తినకూడదని, అలాగే తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా రాత్రిపూట చిన్న పిల్లలకు పసుపు కలిపిన ఒక కప్పు పాలు ఇస్తే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. వీలైతే, ఒక చెంచా చవాన్‌ ప్రాష్ తినాలన్నారు. కర్పూరం, లవంగాలు వేసి ఇంట్లో కాల్చితే వైరస్ దరిచేరదన్నారు.

 

ఉదయం లేచిన తర్వాత టీలో ఒక లవంగాలు వేసి తాగితే ఉపశమనం ఉంటుందన్నారు. పండ్లలో వీలైనంత ఎక్కువ నారింజ మాత్రమే తినాలని చెబుతున్నారు. ఊరగాయ, జామ్, పొడి మొదలైన ఏ రూపంలోనైనా ఆమ్లాను తింటే ఎనర్జీగా ఉంటుందన్నారు. కరోనాను జయించాలంటే వీటన్నింటినీ పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar