Holi Colors: హోలీ అంటేనే.. రంగుల కేళీ. హోలీ అంటేనే రంగులు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. తేడా లేకుండా ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ఈ పండగను జరుపుకుంటారు. హోలీ రోజు మాత్రం అజాగ్రత్తగా ఉంటే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు తప్పనిసరి.. (Holi Colors)
హోలీ అంటేనే రంగులు, సరదాలు. అందరూ ఒక చోట చేరి పండగ. ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటా.. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హోలీ ఆడే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే.. వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కంటి చికాకు, అలెర్జీలు, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ హోలీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి..
ప్రస్తుత కాలంలో సహజ రంగులు లేకుండా హోలీ పండగ జరుపుకోవడాన్ని ఊహించలేం. హోలీ సందర్భంగా ఉపయోగించే రంగుల్లో విషపూరిత రసాయనాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పాదరసం, సిలికా, ఆస్బెస్టాస్, మైకా, సీసం వంటి అనేక రసాయనాలను వాడుతున్నారు. ఇవి చర్మానికి, కళ్లకు హాని కలిగించడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తాయని చాలా మందికి తెలియదు. మార్కెట్లో సేంద్రీయంగా తయారైన హోలీ రంగులతో పాటు.. సింథటిక్ రంగులు కూడా లభిస్తున్నాయి. కొందరు డబ్బులను ఆదా చేయడానికి హానికర రంగులను ఉపయోగిస్తున్నారు. హోలీ రంగుల్లో ఉపయోగించే మైకా, గాజు కణికలు ఆస్బెస్టాస్ వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. హోలీ ఆడే సమయంలో వాటర్-గన్‌లు వాటర్ బెలూన్ లను దూరంగా ఉండటం మంచిది. చెవిలో నీరు ప్రవేశించి దురద, చెవినొప్పి , అడ్డంకులు ఏర్పడతాయి. చెవిని తాకినప్పుడు నీటి బుడగలు యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.
సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
రసాయనాలతో తయారు చేసిన రంగులతో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొడిగా ఉండే రంగులు గాల్లోకి విసిరినప్పుడు నెమ్మదిగా పడిపోతాయి, ఇది 10 మైక్రాన్ల కంటే తక్కువ కణాల యొక్క సాంద్రతను చూపిస్తుంది. ఈ రంగుల్లోని కలుషితాలు నోరు, శ్వాసనాళాల్లోకి ప్రవేశించి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. దీంతో అవి ఊపిరితిత్తులలోకి పీల్చబడతాయి. అదే జరిగితే ఊపిరితిత్తుల్ అవి అక్కడే ఉండి మంటతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
ఆస్తమా, COPD మొదలైనవాటిని తీవ్రతరం చేస్తుంది. రంగుల్లో రేణువుల రసాయనాల వల్ల రోగనిరోధక శక్తి, ఆస్తమా తో బాధపడుతున్న వ్యక్తులు హోలీ ఆడకుండా ఉండటం మంచిది. ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇతర శ్వాసకోశ పరిస్థితులు ఈ రసాయనాల ద్వారా తీవ్రతరం అవుతాయి. మరో వైపు ఇది అలెర్జీలకు కారణమవుతుంది. సింథటిక్ రంగులు నాసికా కుహరాలను ఇబ్బంది పెడతాయి. చెవి ఇన్ఫెక్షన్ కి కూడా ఓ కారణం అవుతుంది. వాటర్-గన్‌లు, వాటర్ బెలూన్‌లతో హోలీ ఆడటం మంచిది కాదు. ఎందుకంటే చెవిలో నీరు ప్రవేశించి దురద, చెవినొప్పి వచ్చే అవకాశం ఉంది.దీని వల్ల చెవిపోటు ,వినికిడి లోపం ఏర్పడవచ్చు.
చర్మ అలెర్జీలకు కారణమవుతుంది. ఓ అధ్యయనంలో హోలీ రంగులు తీవ్రమైన చర్మ అలెర్జీలకు కారణమవుతాయని తెలిసింది. దురద అత్యంత సాధారణ లక్షణం, ఆ తర్వాత చర్మం మంట, నొప్పి వంటి లక్షణాలకు రంగులు కారణమౌతాయి. సింథటిక్ హోలీ రంగులను ఉపయోగించడం సులభమైన ప్రత్యామ్నాయంగా అనిపించవచ్చు, అయితే శ్వాసకోశ సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు ENT సమస్యలను నివారించడానికి పూల రేకులు, మూలికలు, కూరగాయల సారం, పసుపుతో చేసిన పర్యావరణ అనుకూల రంగులను ఎంచుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ సురక్షితంగా , సరదాగా హోలీ జరుపుకోవాలంటే సహజసిద్ధమైన రంగులను ఎంచుకోవటం మంచిది.