Site icon Prime9

 Bay leaf  Benefits: బిర్యానీ ఆకుతో రుచే కాదు.. ఆరోగ్యం కూడా

Bay leaf1

Bay leaf1

 Bay leaf  Benefits: బిర్యానీ ఆకులు.. కేవలం వాసన కోసమే అనుకుంటారు చాలామంది. కానీ బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క బిర్యానీ ఆకు అనేక సమస్యలకు మెడిషన్ లా పనిచేస్తుంది. అయితే బిర్యానీలు, మసాలా కర్రీల్లో కాకుండా ఈ ఆకులను పలు రకాలుగా తీసుకోవచ్చు.

 

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Bay leaf  Benefits)

బిర్యానీ ఆకులతో టీ చేస్తే వాసన తో పాటు రుచికరంగాను ఉంటుంది. ఈ ఆకులోని అన్ని లక్షణాలను టీ గ్రహిస్తుంది. బిర్యానీ ఆకులతో చేసిన టీ ప్రతిరోజూ తాగితే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్‌ కరిగిపోతుంది.

మాంసంతో గానీ, మరే ఆహారంలో అయినా బిర్యానీ ఆకుల్ని వాడితే తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. గ్యాస్‌ట్రబుల్‌, వాంతులు లాంటి సమస్యలు ఉండవు.

ఐరన్‌, కాల్షియం, మాంగనీసుతో పాటు విటమిన్‌-కె పుష్కలం కాబట్టి ఎముకల దృఢత్వానికి, పటుత్వానికి ఉపయోగపడుతుంది.

రక్తంలోని చక్కెరశాతాన్ని బిర్యానీ ఆకు అదుపులో ఉంచుతుంది. చక్కటి నిద్ర కూడా పడుతుంది.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఈ రోజుల్లో ఆందోళన, ఒత్తిడి సహజంగా ఉంటున్నాయి. ఈ ఆకుల్లో ఉండే లినూల్స్‌ శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లను అదుపు చేసే గుణం ఉంటుంది. అందుకే ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

ఈ హెర్బల్‌ ఆకుల రసాన్ని కీళ్లవాపులు, కండరాల నొప్పులను తగ్గించడానికి వాడతారు.

 

ఎక్కువగా తీసుకోవద్దు

శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఫ్లూ తగ్గిస్తుంది. దీంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటిచూపుతో పాటు చర్మఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆరోగ్యానికి మంచిదని మూడు కంటే ఎక్కువ బిర్యానీ ఆకులు వేసుకుంటే రక్తం గడ్డకట్టకపోవడంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

బిర్యానీ ఆకుల పొడి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం ఉండేవారికి ఎంతో మంచిది.

దగ్గు, వైరల్‌ ఫీవర్లలాంటివి కూడా బిర్యానీ ఆకుతో తగ్గిపోతాయి. శ్వాస కోస సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్ సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం బిర్యానీ ఆకులు కాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఫైటోన్యూట్రియెంట్స్ కలిగి ఉంటాయి.

బిర్యానీ ఆకులు క్రిమినాశక, మూత్రవిసర్జన, ఉపశమన మరియు యాంటీఆక్సిడెంట్ పదార్థాలను కలిగి ఉంటాయి.

 

Exit mobile version
Skip to toolbar