Site icon Prime9

Andhra Pradesh: ఎంపీ మాధవ్ వీడియో ఫేక్.. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప

Andhra Pradesh: హిందూపురం వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో వ్యవహారం పై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. వీడియో కాల్‌ వ్యవహారం పై ఎంపీ మాధవ్‌ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఈనెల 4న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు

దర్యాప్తులో భాగంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయినట్లు గుర్తించామన్నారు. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో మొదట ఈ వీడియోను పోస్టు చేశారని సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన నెంబరు ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్‌ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ చెప్పారు.

Exit mobile version