Site icon Prime9

Mahasena Rajesh : మహాసేన రాజేష్ కారుపై వైసీపీ నేతల దాడి…

ysrcp leaders attack on mahasena rajesh car in rajahmundry

ysrcp leaders attack on mahasena rajesh car in rajahmundry

Mahasena Rajesh : మహాసేన రాజేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నందంగని రాజు జంక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన నాయకుడు వై. శ్రీను పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్ కారుపై సందర్భంగా… పెద్ద ఘర్షణ వాతావరణమే చెలరేగింది. ఓ వైపు న్యూఇయర్ వేడుకలు.. మరోవైపు తమ పార్టీ నేత పుట్టినరోజు ఉండటంతో.. జనసేన కార్యకర్తలు ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. ఈ వేడుకలకు మహాసేన రాజేష్ కూడా హాజరయ్యారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతని కారుపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసి ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. మహాసేన రాజేష్‌ను అక్కడ నుంచి పంపించగా… దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తమ పార్టీ నేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్‌పై దాడి చేయడం పట్ల జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Exit mobile version