Site icon Prime9

NTR 30 : ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

young tiger ntr 30th movie update from movie makers

young tiger ntr 30th movie update from movie makers

NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ అందుకున్న తారక్… ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. కేవలం భారత్ లోనే కాకుండా జపాన్, యూఎస్ లలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండకపోవచ్చనీ … కొరటాలతో ఉండకపోవచ్చనే వార్తలు కూడా షికారు చేశాయి.

కాగా ఆర్ఆర్ఆర్ RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ మొదలవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు ఎన్టీఆర్ 30 మూవీ యూనిట్. కొత్త సంవత్సరంలో మొదటి రోజునే ఈ సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా… ఏప్రిల్ 5 .. 2024లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వచ్చేనెలలో మొదలవుతుందని స్పష్టం చేశారు.

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వదిలిన ఈ ట్వీట్ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ పోస్టర్, వాయిస్ రిలీజ్ చేయడంతో ఇది మాస్ యాక్షన్ సినిమాలా ఉండబోతుందని భావిస్తున్నారు. ఈ పోస్టర్ లో కూడా ఎన్టీఆర్ కత్తి పట్టుకొని ఉండడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version