Site icon Prime9

Tirumala: వైసీపీ నేత ఓవర్ యాక్షన్.. శ్రీవారి ఆలయం ఎదుట ఫొటో షూట్ తో హల్ చల్

YCP Leader Photo Shoot Before Tirumala Temple: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడక్కడా ఆ పార్టీకి చెందిన రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పార్టీయే ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీలయిపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, నిత్యం జనం కోసం తపించే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా, తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుడు వంశీధర్‌రెడ్డి రెచ్చిపోయాడు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లలో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి వ్యవహారంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు చర్యలు తీసుకొని .. వైసీపీ రౌడీ మూకలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

Exit mobile version