Site icon Prime9

Yadadri Temple: యాదాద్రి ఆలయానికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం

Yadadri

Yadadri

Yadadri: కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం నాటి రికార్డును నిన్నటి ఆదాయం బ్రేక్ చేసింది.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ. 1,16,13,977ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,24,650, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచార శాఖ రూ..2,87,500, విఐపి దర్శనం రూ.18,90,000, యాద ఋషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం ద్వారా రూ44,37,150, పాతగుట్ట రూ.3,78,670, కల్యాణకట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండ పైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 9,75,000, సువర్ణ పుష్పార్చన రూ. 2,52,348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానం రూ.55,659, బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9,75,000లు ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. దర్శనం అనంతరం సాయంత్రం భక్తులు ఒక్కసారిగా తిరుగుప్రయాణం కావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్-హైదరాబాద్ మార్గంలో అర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

Exit mobile version
Skip to toolbar