Prime9Special: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. టెక్స్‌టైల్ పరిశ్రమలు మూతపడ్డంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు విధిలేని పరిస్థితుల్లో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ఉద్యోగాలు చేయడానికి నైపుణ్యం లేని కారణంగా పడుపు వృత్తిలో దిగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మహిళలు.
ఈ ఏడాది జనవరి వరకు దర్జాగా బతికిన వారి బతుకులు ఒక్కసారిగా బుగ్గి పాలు అయ్యాయి. ఆయుర్వేదిక్ స్పాలు నడిపిన చోట్ల తాత్కాలిక బ్రోతల్స్ హోంలుగా మార్చాల్సి వచ్చింది. టెక్స్‌టైల్స్,దుస్తుల రంగానికి ఇండియా, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు తగ్గడంతో ఈ రంగం కాస్తా కుదేలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడంతో విధిలేని పరిస్థితిలో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలో దిగాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంకకు చెందిన ది మార్నింగ్ డైలీ పత్రిక అంచనా ప్రకారం టెక్స్‌టైల్ రంగంలో పనిచేసే మహిళలు పడుపు వృత్తిలో దిగి పొట్ట పోసుకుంటున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది.
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో గత్యంతరం లేక వేశ్య వృత్తిలోకి దిగాల్సి వచ్చిందని, ఇతర రంగాల్లో నైపుణ్యం లేనందు వల్ల ఈ రంగాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని చాలా మంది మహిళలు చెప్పారు. టెక్స్‌టైల్స్ ప్యాక్టరీ పనిచేస్తే నెలకు 28వేల రూపాయలు ఆర్జించే వారమని, ఓవర్ టైంతో కలిపితే 35 వేల రూపాయాలు సంపాదిస్తామని వీరు తెలియజేశారు. అయితే సెక్స్ వర్కర్‌గా పనిచేస్తే రోజుకు 15వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నామని చెబుతున్నారు. అయితే దీనికి చాలా మంది అంగీకరించకపోవచ్చు కానీ, ఇది పచ్చి నిజమని ది మార్నింగ్ స్టార్ పత్రిక పెద్ద కథనాన్ని ప్రచురించింది.
ఈకో టెక్స్‌టైల్స్ డాట్‌కామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఇండియా, బంగ్లాదేశ్‌ల నుంచి సుమారు పది నుంచి 20 శాతం ఆర్డర్లు తగ్గాయని, దీనికి కారణం శ్రీలంకపై కొనుగోలుదార్లకు నమ్మకం పోయిందని వెల్లడించింది. ది మార్నింగ్ స్టార్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ కూడా 30 శాతం మంది మహిళలు ఈ ఏడాది జనవరి నుంచి కొలంబోలో వేశ్యవృత్తిలో దిగారని ఈ రెండు వార్తాపత్రికలు పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ఈ మహిళలంతా తమ పిల్లలు, తల్లిదండ్రులను పోషించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు స్టాండప్ మూవ్‌మెంట్ లంక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశిలా డండేనియా చెప్పారు. దీంతో పాటు త్వరగా డబ్బు సంపాదించుకోవాలనుకునే వారు కూడా ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.
సెక్స్‌ట్రేడ్‌లోకి రావడానికి ఉసిగొల్పిన విషయాల విషయానికి వస్తే, ప్రధానంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, రెండోది టెక్స్‌టైల్ రంగంలో వేతనాలు భారీగా తగ్గిపోవడం, దీనికి తోడు ఇంధనం, ఆహారం, మందుల కొరత దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఈ దేశంలో భవిష్యత్తు లేదనే నిర్ణయానికి మహిళలు వచ్చారు. నిత్యావసర సరకులు లేకపోవడంతో చాలా మంది స్థానిక దుకాణదారులతో సెక్స్‌లో పాల్గొని తమకు కావాల్సిన ఆహారం, మందులు, తీసుకువెళుతున్నారు. కొలంబోలోని బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఇండస్ర్టియల్ జోన్‌లో సెక్స్ బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. పోలీసులు కూడా బలవంతంగా వీరి నుంచి డబ్బులాక్కోవడం లేదా బలవంతంగా వీరితో కోరికలు తీర్చకుంటున్న సంఘటనలు ఉన్నాయి.
కొలంబో నుంచి వస్తున్న వార్తల ప్రకారం అ మహిళలకు వద్దకు చదువుకున్న వారితో పాటు మాఫియా ముఠాలు వస్తున్నాయి. రాజపక్సప్రభుత్వం రసాయనాలు ఎరువులు వాడరాదని మే 2021న ఆదేశించడంతో 50 శాతం వ్యవసాయం కుంటుపడిపోయింది. దీంతో ప్రజలు కష్టాలు మరింత పెరిగిపోయాయి. వ్యవసాయరంగంలో చేసేందుకు పనిలేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక ఈ వృత్తిలోకి దిగాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో విచ్చలవిడిగా సెక్స్ దందా పెరిగిపోవడంతో శాంతిభద్రతల పరిస్థితులు తలెత్తున్నాయి.