Union Budget 2023-24: కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు.
2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు.
బడ్జెట్ పలు రంగాలను సృశిస్తూ, కేటాయింపులు, వివిధ స్కీములకు సంబంధించిన వివరాలను చదివి వినిపించారు.
కేంద్ర బడ్జెట్ లో ఏడు ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఇవాళ ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతూ… సమ్మిళిత వృద్ధి, దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడం, మౌలిక సదుపాయాలు కల్పించడం-పెట్టుబడులు, అన్ని వర్గాల వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, పర్యావరణసహితంగా ఆర్థిక అభివృద్ధి సాధించడం, దేశంలోని యువ శక్తి, దేశ ఆర్థికాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
అదే విధంగా బడ్జెట్(Union Budget 2023-24) ప్రకారం ధరలు తగ్గేవి, ధరలు పెరిగేవి ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ధరలు తగ్గేవి..
మొబైల్ విడిభాగాలపై,
టీవీలు,
ఎలక్ట్రిక్ వస్తువులు,
కిచెన్ చిమ్నీలు,
హీట్ కాయిల్స్,
కెమెరా లెన్స్
బయోగ్యాస్
ఎలక్ట్రిక్ కార్లు,
బొమ్మలు,
సైకిళ్లు
లిథియం అయాన్ బ్యాటరీలు
(Union Budget 2023-24) ధరలు పెరిగేవి..
టైర్లు,
సిగరెట్లు,
బంగారం,
వెండి, వజ్రాలు
బ్రాండెడ్ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు
2023-24 బడ్జెట్ లో వేతన జీవులపై కరుణ చూపించారు.
అన్ని మినహాయింపులతో కూడుకుని రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఊరట కలిగిస్తూ, ఇన్ కమ్ టాక్స్ రిబేటును విస్తరిస్తున్నట్టు తెలిపారు.
తద్వారా ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు.
అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు.
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని.. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు.
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను… రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.
పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
అదే సమయంలో టీవీ ప్యానెళ్లపైనా ఉదారంగా వ్యవహరించారు.
మొత్తమ్మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు.
అటు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/