Site icon Prime9

Viveka Murder Case: “వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే”.. కేసుకు అడ్డుపడుతున్నారు..!

dasthgiri on viveka murder case

dasthgiri on viveka murder case

Viveka Murder Case: “మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే. ఇందులో పెద్దపెద్ద వాళ్ల హస్తం ఉండడం వల్లే ఈ కేసు ముందుకు వెళ్లడం లేద”ని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. గురువారం ఆయన వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.

‘వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ అంతా ఒక్కటే. ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఈ రోజు వరకూ వివేకానందరెడ్డి హత్య కేసు తేలకుండా చేస్తున్నారు. సీబీఐ లాంటి పెద్దపెద్ద వాళ్లనే కీలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారు, ఇంక వారి ముందు నేనెంత? అంటూ దస్తగిరి ప్రాణభయంతో వాపోయారు. ఈ కేసులో సాక్ష్యం నేనే కాబట్టి నేను లేకుండా పోతే ఇంక ఎవరు ఏమీ చేయలేరని, కేసు ముగిసిపోతుందనే ఉద్దేశంతో నన్ను ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నానని అందుకే మీడియా ముందుకు వస్తున్నాని దస్తగిరి తెలిపారు. నా చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే భయంవేస్తుందని తనకు ప్రాణ హానీ ఉందని ఎస్పీకి లేఖ రాశానని తెలిపారు. తనకేమైనా అయితే సీఎం జగన్ దే బాధ్యతని దస్తగిరి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు.. ఆర్ఎస్ బ్రదర్స్ లో సోదాలు

Exit mobile version