Speaker Birla: అవినీతి, అక్రమాలపై పోరాటానికి గుర్తే విజయదశమి

స్వర్ణభారత్ ట్రస్ట్ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమాల్లో పాల్గొన్నారు

Nellore: నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తొలుత స్వర్ణ భారత్ ట్రస్ట్ అక్షర విద్యాలయంలో విష్ణు కార్స్ సహకారంతో ఏర్పాటు చేసిన విజయ సారధి డ్రైవింగ్ పాఠశాలను స్పీకర్ ప్రారంభించారు. ప్రతి ఏటా స్వర్ణభారత్ ట్రస్ట్ లో దసరా వేడుకలు నిర్వహిస్తుంటారు. ప్రతిభకు పురస్కారాలు అందచేస్తుంటారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ట్రస్ట్ లో విద్యా విజ్నానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. చిన్నారులకు విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పిస్తుండడం అభినందనీయమన్నారు. మహిళలు స్వశక్తితో ఎలా ఎదగాలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆ విధంగా అడుగులు వేయడాన్ని అభినందించారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వడం ఓ భాగంగా మారాలన్నారు. ప్రజా సేవలేని జీవితం వ్యర్ధమన్నారు. అవినీతి అక్రమాలపై పోరాటమే విజయదశమి వేడుకకు అర్ధంమన్నారు.

ఇది కూడా చదవండి: Dussehra Holidays : ప్రయాణికులకు తీరని కష్టాలు !