Site icon Prime9

Viral Video: ఎంత క్రూరత్వం.. కారుపై వాలినందుకు ఆరేళ్ల బాలుడిని తన్నిన కేరళకు చెందిన వ్యక్తి

video-man-kicks-6-year-old-in-the-chest-for-leaning-on-his-car-arrested

Kerala: తన కారు పై ఆనుకుని ఉన్న ఆరేళ్ల బాలుడిని తన్నిన కేరళకు చెందిన వ్యక్తి పై కేసు నమోదైంది. ఈ సంఘటన CCTVలో రికార్డు అయింది. ఆ ఫుటేజీలో  ఒక బాలుడు రద్దీగా ఉన్న రహదారి పై నిలబడి ఉన్న తెల్లటి కారుకు ఆనుకుని ఉన్నాడు, కార్ డ్రైవర్ బాలుడికి ఏదో చెప్పి అతని ఛాతీ పై తన్నడం కనిపించింది. రాజస్థాన్ నుండి వలస వచ్చిన కార్మిక కుటుంబానికి చెందిన బాలుడు నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళాడు.

రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి అయిన ఓ యువ న్యాయవాది పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కేసు నమోదు చేసి నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్, తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ శ్యాంసీర్ తెలిపారు.

ఈ ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి, మానవత్వం అంటే షాపుల నుంచి కొనుక్కోగలిగేది కాదని అన్నారు.

Exit mobile version