UI The Movie Review in Telugu: రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యూఐ: ది మూవీ’. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. కన్నడ, తెలుగులో ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయిత ఈ మధ్య ఆయన దర్శకత్వం పక్కన పెట్టి కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదేళ్ల తర్వాత యూఐతో మరోసారి మెగాఫోన్ పట్టారు. ఎన్నో అంచనాల మధ్య నేడు శుక్రవారం (డిసెంబర్ 20) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడ, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మరి ఆడియన్స్ మెప్పించిందా? లేదా? చూద్దాం.
ఈ సినిమా స్వయంగా ఉపేంద్ర ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు. అన్ని భాషల ఆడియన్స్‌ని స్వయంగా కలిసి ముచ్చటించారు. ఈ సినిమా థియేటర్‌లో ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది, మూవీ క్లైమాక్స్ ఊహించని రేంజ్‌లో కొత్తగా ఉంటుందని చెప్పి హైప్ పెంచారు. చెప్పినట్టుగానే మొదట్లోనే ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ‘నువ్వు తెలివైనవాడిని అయితే సినిమా చూడకుండా వెళ్లిపో’ అనే స్టేట్‌మెంట్ వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేసింది. అన్నట్టుగానే యుఐలో వింటేజ్ ఉపేంద్రను చూశామంటున్నారు ఆడియన్స్. అయితే దీనికి ఓ వర్గం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుండగా.. మరికొందరు నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దీంతో యుఐ ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లో రన్ అవుతుంది.
స్వయంగా చూడాల్సిందే
కథ, విశ్లేషణ
యూ అండ్ ఐ.. పగలు, రాత్రి.. కల్కి భగవాన్ వర్సెస్ సత్య (ఉపేంద్ర) అనే కాన్సెప్ట్‌తో మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని సటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర. హీరోగా, దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్‌తో వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశారు. మూవీ ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో వచ్చే సైకో లవ్ ట్రాక్ ఉపేంద్ర, రా చిత్రాల మార్క్ కనిపించింది. సినిమాలో వచ్చే పాటలు సైతం సెటైరికల్‌గానే అనిపించాయి. ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా పాటలను సైతం రూపొందించారు. ముఖ్యంగా ఇంట్వర్వెల్ బ్లాక్‌తో తన ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమాలోని ఓ ఎపిసోడ్ డిఫరేంట్ టేకింగ్‌తో ఆశ్చర్యపరిచారు. అది చూసిన వారంత ప్రపంచంలో ఏ డైరెక్టర్‌కు కూడా ఇలా తీయాలనే ఆలోచన వస్తుందా? అనే ఆలోచన వెళ్లిపోతారు.
అంతలా తన డిఫరేంట్ టేకింగ్ సర్‌ప్రైజ్ చేశాడు ఉపేంద్ర. ఇక ఈ సినిమా అంత ఒక ఎత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. రెండు డిఫరేంట్ క్లైమాక్స్‌లు పెట్టి ఆడియన్స్ ఆశ్చర్యపరించాడు. నిజానికి ఈ ఆలోచనకి ఉపేంద్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మేకింగ్ క్వాలిటీ అదిరిపోయింది. యూఐ ఉపేంద్ర వన్ మ్యాన్ షోతో నడిపించాడు. దర్శకుడిగా, హీరోగా అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ఇష్యూస్‌ని తెరపై బలంగా చూపించడంలో డైరెక్టర్ మరోసారి ఉపేంద్ర సక్సెస్ అయ్యాడు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్‌తో ‘యూఐ’ అదరగొట్టింది. ఇలాంటి కథలున్న సినిమాలు రావడం చాలా అరుదు. మీకు థియేటర్లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. మొత్తానికి ‘యూఐ’ మూవీ తప్పక చూడాల్సిన చిత్రమని అభిమానులు అంటున్నారు.
రేటింగ్: 3.2