Site icon Prime9

Upasana: ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగా కోడలు

upasana

upasana

Upasana: మెగా కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన (Upasana) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.

ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా నానమ్మతో ఉపాసనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఆ మేరకు తన నానమ్మ తో దిగిన పలు ఫొటోలను పంచుకుంది ఉపాసన.

నీ నుంచి చాలా నేర్చుకున్నాను

‘చివరి వరకు ఎంతో కృతజ్ధత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో మీ ద్వారానే తెలుసుకున్నాను.

నానమ్మనే నన్ను పెంచింది. నా గ్రాండ్ పేరేంట్స్ తో నేను అందుకున్న ప్రేమానురాగాలను.. నా పిల్లలకు కూడా అందేలా చూస్తానని మాటిస్తున్నాను.

నీ ఆత్మకు శాంతి చేకూరాలి పుష్ నాని’ అంటూ ఉపాసన ఎమోషనల్ మెసేజ్ తో పోస్ట్ పెట్టారు.

 

కాగా, ఉపాసనకు తన గ్రాండ్ పేరెంట్స్ తో మంచి అనుబంధం ఉంది. చాలా సందర్భాల్లో వారితో గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఉపాసన.

గత కొన్ని రోజులుగా ఉపాసన(Upasana) కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్, ఉపాసన జంట త్వరలో తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇక ఇదే ఊపులో ఆర్ఆర్ఆర్ సినిమా లోని ‘నాటు నాటు’పాటకు గోల్డెన్ అవార్డు దక్కించుకోవడం..

లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డులు కార్యక్రమంలో రాంచరణ్ తో కలిసి పాల్గొని సందడి చేశారు ఉపాసన.

ప్రెగ్నెన్సీ వార్త దగ్గర నుంచి.. అన్ని శుభవార్తలు వింటూ.. సంతోషంగా గడుపుతున్న సమయంలో.. ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఉపాసన కు నానమ్మ మృతి చెందడం తీరని లోటు అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version