Udhayanidhi Stalin : కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఈయన సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ప్రస్తుతం తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సినిమాలకు గుడ్ బై అని ప్రకటించారు. అయితే తాజాగా తన కొడుకు ప్రేమ వ్యవహారంపై ఉదయనిధి స్టాలిన్ సంచలన కామెంట్ చేశారు.
ఇటీవల తన కొడుకు అతని గర్ల్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రంలో కరుణానిధి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. దీంతో ఈ విషయం మీడియాలో కోడై కూస్తుంది. ఆ ఫొటోల్లో స్టాలిన్ కొడుకు ఇంబానితి, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. అయితే ఈ ఫొటోలపై ఉదయనిధి స్టాలిన్‌ను కొన్ని తమిళ యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయాలను అడిగాయి. తన కొడుకు మేజర్ అని, ఆయనకు వ్యక్తిగత స్వేచ్ఛ, స్పేస్ ఉంటుందని మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివరించారు.
ఆ విషయాలు అన్నీ ఆయన పర్సనల్ లైఫ్ – ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)
‘తనకు ఇప్పుడు 18 ఏళ్లు. అది ఆయన పర్సనల్ లైఫ్. తల్లిదండ్రులుగా మాకు, మా కొడుకుకు మధ్య ఉన్న విషయాలను బయటకు వెల్లడించాలని భావించడం లేదు. రాజకీయ కుటుంబానికి చెందినవాడు కావడంతో ఇలాంటి ఆరోపణలు, ట్రోల్స్ వస్తూనే ఉంటాయి’ అని ఓ ఇంటర్వ్యూలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు. ‘ఆయనకు సరిపడా పరిణతి ఉంటే వాటిని ఆయనే స్వయంగా హ్యాండిల్ చేస్తాడు. ఆ విషయాలు అన్నీ ఆయన పర్సనల్ లైఫ్. నేను కూడా ఒక స్థాయి తర్వాత అతని జీవితంలో కలుగజేసుకోను. అది ఆయన స్వేచ్ఛ’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ భార్య క్రితికా ఉదయనిధి ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్రేమించడం, ప్రేమను వ్యక్తీకరించడం నిషిద్ధమైనదేమీ కాదు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/