Site icon Prime9

Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ పై న్యాయపోరాటానికి సిద్దమవుతున్న ట్విట్టర్

Elon Musk Twitter Deal: ట్విట్టర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై దావా వేయాలని ట్విట్టర్ యోచిస్తోంది. దీనిపై మస్క్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. Oh the irony lol అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దావా గురించి మాత్రం అతను ప్రస్తావించలేదు. ట్విట్టర్ తో ఎలాన్ మస్క్ 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం చేసుకోవడం అటు తర్వాత ఫేక్‌ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో మస్క్‌పై న్యాయపోరాటానికి ట్విట్టర్ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ‘రోసెన్ అండ్ కాట్జ్, ఎల్ఎల్‌పీ వాటెల్, లిప్టన్’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ ను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని, లేకపోతే బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టును కోరనుంది. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టైలర్ కూడా వెల్లడించారు.

ఒప్పందం రద్దుకు గల కారణాలను మస్క్ ప్రకటించారు. ఒప్పందంలో నియమాలు ఉల్లంఘించడం వల్ల ఈ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఫేక్, స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విట్టర్ ఘోరంగా విఫలం చెందిందని అందుకే ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో మస్క్ పలు పోస్టులు చేశారు.

పోస్ట్ చేసిన ఇమేజ్ లోని మొదటి గ్రిడ్ లో నవ్వుతున్న ఫొటో పెట్టి పక్కనే వాళ్లు నేను ట్విట్టర్ కొనలేనన్న కామెంట్ చేశారు. సెకండ్ గ్రిడ్ లో ఇంకాస్త గట్టిగా నవ్వుతున్న ఇమేజ్ పక్కనే తర్వాత బాట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరదన్నారు అని రాసుకొచ్చారు. థర్డ్ గ్రిడ్ లో ఇప్పుడు కోర్టుకెళ్లి నాతో బలవంతంగా ట్విట్టర్ కొనిపిస్తానంటున్నారన్నారు. ఇక ఫోర్త్ గ్రిడ్ లో మస్క్ పగలబడి నవ్వుతున్న ఫొటో పక్కన బోట్ సమాచారాన్ని కోర్టులో బహిర్గతంలో చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ట్విట్టర్ దావా వేసిన అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. ట్విట్టర్‌ను మస్క్‌ కొనుగోలు చేయదలచుకోలేదంటే బిలియన్‌ డాలర్ల పరిహారాన్ని మస్క్‌ ట్విట్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్‌ బిలియన్‌ డాలర్ల కోసం కోర్టుమెట్లు ఎక్కనుంది.

Exit mobile version