Site icon Prime9

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

TTD Cancels Reverse Tendering System: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. ఈ మేరకు గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈఓ శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

తిరుమలలో ఆలయ పవిత్రతను కాపాడాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ భక్తుల నమ్మకానికి భంగం వాటిల్లకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. తిరుమలలో గోవింద నామస్మరణ తప్పా మరొకటి వినిపించవద్ద్నారు. భక్తులను ౌరవం ఇచ్చుకోవాలని, భక్తుల సూచనల మేరకు వసతులు కల్పించాలన్నారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలను కల్పించాలన్నారు.

అలాగే ప్రశాంతతకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ విషయంలోనూ రాజీపడవద్దని, ముఖ్యంగా తిరుమల ప్రసాదం నాణ్యత ఎప్పుడూ ఒకేలా ఉండాలని, ప్రసాదాల తయారీలో వాడే పదార్థాలు బాగుండేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గేలా చూడాలని, అందరినీ గౌరవించాలన్నారు. ఆర్భాటాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కనిపించాలన్నారు.

తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం సమీపంలో మాడ్రన్ కిచెన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. దీనిని సుమారు. రూ.13.45కోట్ల వ్యయంతో రూపొందించారు. ఇందులో వంటతోపాటు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, ఆహార తయారీతోపాటు ఆవిరి ఆధారిత వంట ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అనంతరం బయో డైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version