Site icon Prime9

Movie Theatre : చెన్నైలో ఘోర ఘటన.. సంచార జాతి వారిని అనుమతించని థియేటర్ యాజమాన్యం

tribals not allowed to theatre in chennai and news got viral

tribals not allowed to theatre in chennai and news got viral

Movie Theatre : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ ఘోర ఘటన జరిగింది. తాజాగా నగరంలోని ఓ ప్రముఖ థియేటర్ లో గిరిజన తెగకు చెందిన వారిని లోపలికి అనుమతించక పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు థియేటర్ యాజమాన్యం వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. కళ అనేది ఎవరి సొత్తు కాదని.. అందరికీ సొంతం అని సదరు థియేటర్ సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ హీరో శింబు నటించిన ‘పత్తు తల’ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన గిరిజనులు కూడా ఈ సినిమా చూడడానికి వచ్చారు. అందరి లాగానే సినిమా చూసేందుకు వారు కూడా డబ్బులు పెట్టి మార్నింగ్ షోకి టికెట్ కొనుక్కున్నారు. ఇక సినిమా చూడడానికి లోపాలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడి థియేటర్ సిబ్బంది వారిని ఆపేసింది.

వారికీ లోపలికి ప్రవేశం లేదంటూ, వారిని వెనక్కి వెళ్ళిపోమంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయాన్ని చూసిన శింబు అభిమానులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చెన్నై లాంటి సిటీల్లో కూడా ఇలాంటి అంటరానితనం ఏంటని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ గంటల వ్యవధి లోనే వైరల్ అయ్యి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ వరకు చేరుకుంది.

సినిమా, కళ అనేవి అందరికి సొంతం.. జి వి ప్రకాష్ (Movie Theatre)

ఇది చూసిన జివి స్పందిస్తూ.. ”సినిమా, కళ అనేవి అందరికి సొంతం. అవి అందరికి సమానమే. టికెట్స్ ఉన్నా వారిని థియేటర్ లోకి రానివ్వకపోవడం సరికాదు. వారిని కూడా సినిమా చూడడానికి అనుమతించాలి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక చివరికి థియేటర్ యాజమాన్యం వారిని తరువాత షోకి అనుమతించి సినిమా చూపించింది. వారందరు సినిమా చూస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. జరిగిన సంఘటన పై వివరణ ఇచ్చారు.

అలానే ”పత్తు తల సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. వచ్చిన ట్రైబల్ కుటుంబంలో 2,6,8,10 వయసులకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వారిని మాత్రమే అనుమతించడానికి నిరాకరించాం. అసలు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోకుండా అభిమానులు వేరే కోణంలో ఆ వీడియోని పోస్ట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే చిన్న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగా థియేటర్లు ఎప్పుడు నిర్వహిస్తున్నారో అందరికీ తెలుసని.. ఎప్పుడు లేని విధంగా ఇష్యూ సీరియస్ అవ్వడంతో ఈ విధంగా కవర్ చేసుకోవడం ఎందుకని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

Exit mobile version