Site icon Prime9

Formula race: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లకండి?

formula e race trail run in Hyderabad

formula e race trail run in Hyderabad

Formula race: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగే.. ఈ రేసింగ్ ఫార్ములా కోసం ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. దీంతో వాహనదారులు గమనించి.. సూచించిన మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భారత్ లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ట్రాక్పై ఈ ఈవెంట్ జరగనుంది. రేసింగ్ ట్రాక్ పై కార్లు రయ్ రయ్ దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికి రేసింగ్ కార్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ రేస్‌లో 11 జట్లు.. 22 మంది డ్రైవర్స్ పాల్గొంటారు. ఈ ఈవెంట్ నిర్వహణకు.. ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఫిబ్రవరి 5, 6 తేదీల్లో పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ఫిబ్రవరి 7 నుంచి 12 పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వాహనాదారులు ముందుగానే గమనించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లీంపు ఉండే ప్రాంతాలను పోలీసులు వెల్లడించారు.

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను.. వీవీ విగ్రహం నుంచి సాధన్ కాలేజీ మీదుగా మళ్లించనున్నారు.

బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రానిగంజ్, ట్యాంక్ బండ్ మీదుగా డైవర్ట్ చేయనున్నారు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్ బండ్ వైపు డైవర్ట్ చేస్తారు.

తెలుగు తల్లి నెక్లెస్ రోటరీ మార్గంలో వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపు మళ్లింపు చేస్తారు.

బీఆర్ కే భవన్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్.. ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లెన్ లో వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు మల్లించనున్నారు.

ఖైరతాబాద్ బడా గణేష్ మార్గంలో ప్రింటింగ్ ప్రెస్ లేన్ లో వచ్చే వాహనాలను రాజ్ దూత్ మార్గం గుండా డైవర్ట్ చేసారు.

ఈ రేసింగ్ కు సంబంధించిన పనుల కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లంబిని పార్క్ క్లోజ్ చేయబడుతాయి.

వాహనాదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

బడ్జెట్ సమావేశాలు.. ఈ మార్గాల్లో ఆంక్షలు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.తెలుగుతల్లి ఫ్లై ఓవర్.. ఇక్బాల్ మినార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
అలాగే రవీంద్ర భారతి మార్గాల్లో ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి నిలిపివేయవచ్చు.

ముందుగా సూచించిన ప్రకారం వాహనాదారులు గమనించాలని.. ఈ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నూతన సచివాలయం కూడా ప్రారంభం ఉండటంతో.. సీఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version